Hyderabad, ఫిబ్రవరి 25 -- వేసవి కాలం వచ్చిందంటే చర్మ సమస్యలు తీవ్రమవుతాయి. ఎండ వేడి అన్ని రకాల చర్మాలకు సమస్యలను కలిగించినప్పటికీ, జిడ్డుగల చర్మం ఉన్నవారికి మరింత తీవ్రంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు వేసవి కాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చూడటానికి మరింత జిడ్డుగా అందవిహీనంగా మారుతుంది. క్లెన్సింగ్ నుండి మేకప్ వరకు అన్నింటిలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఈ టిప్స్ పాటించారంటే వేసవిలో కూడా మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

ఏ కాలంలో అయినా ఎలాంటి చర్మం గలవారు అయినా అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా వేసవి కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం, రాత్రి చల్లటి నీటితో ముఖాన్నికడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి, అదనపు నూనెలను తొలగి...