Hyderabad, మార్చి 24 -- వేసవి వచ్చిందంటే చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండ వేడి కారణంగా వేసవిలో చర్మం సహజం కాంతిని కోల్పోతుంది. వాతావరణ మార్పుల కారణంగా చెమట ఎక్కువగా పట్టడంతో ఒంటి మీద మలినాలు పేరుకుపోయి చర్మ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా రోజూ ఎండలో బయటికి వెళ్లే వారు, ఉదయం ఆఫీసుకు వెళ్ళే మహిళల్లో ఈ ఇవి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి.

సూర్యుడి నుంచి విడుదలయ్యే యూవీ కిరణాల కారణంగా చాలా మందికి మహిళలకు చర్మం టాన్ అయిపోతుంది. ఎండ కారణంగా వచ్చే చెమటతో పాటు ప్రయాణ సమయలంలో కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివన్నీ కలిసి చర్మాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఫలితంగా మొటిమలు, చిన్న చిన్న పొక్కులు, దద్దుర్లు, దురద వంటి అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే వేసవి కాలంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సౌందర్య నిపు...