Hyderabad, ఫిబ్రవరి 24 -- ఇండోర్ ప్లాంట్స్ అంటే ఆఫీసులు, ఇళ్ళు లేదా ఎండ తగలని ప్రదేశంలో పెంచే మొక్కలను పిలుస్తుంటారు. ఇవి పరిసరాల అందాన్ని పెంచడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను, చల్లదనాన్ని అందిస్తాయి. అందుకే వీటిని ఇంట్లో కూడా పెంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. సాధారణంగా, ఈ మొక్కలకు తక్కువ కాంతిలో ఉండే సామర్థ్యం ఉంటుంది. గాలిని శుద్ధి చేసే సామర్థ్యంతో పాటు సులభమైన నిర్వహణ ఆధారంగా వీటిని ఎంచుకుంటారు. వేసవిలో ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇంటిని చల్లగా ఉంచడంతో పాటు గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.

ఈ ఇండోర్ ప్లాంట్స్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మొక్కలు భాష్పోత్సేకం అనే క్రియ జరిపి తేమను విడుదల చేస్తాయి. ఇది గదిలోని గాలి తేమను పెంచుతుంది. సహజంగానే గాలిని చల్లబరచడానికి సహాయపడుతుంది. అరేకా పామ్, పీస్...