Hyderabad, ఏప్రిల్ 1 -- ఏప్రిల్ నెల ప్రారంభమైతే ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మండే ఎండల్లో వేడిమి, తేమ, చెమటతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల శరీరం లోపల వేడి కూడా పెరుగుతుంది. వేడి అలసట, వడదెబ్బ ఇతర సమస్యలను నివారించడానికి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా ముఖ్యం. బాడీ హీట్ తగ్గించుకోవడానికి ఇక్కడ చెప్పిన పద్దతులను ఫాలో అవ్వండి.

చల్లని నీరు లేదా ఎలక్ట్రోలైట్లతో హైడ్రేటింగ్ ద్రవ పానీయాలు శరీరాన్ని అంతర్గతంగా చల్లబరచడానికి సహాయపడతాయి. కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కచ్చితంగా మజ్జిగను తాగండి. మజ్జిగలో కొంచెం పుదీనా, నిమ్మరసం, ఉప్పు కలిపి ఉంచుకోండి. ఎండలోంచి వచ్చిన వెంటనే ఈ మజ్జిగ తాగితే వెంటనే శక్తి వస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది.

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగ...