Hyderabad, మార్చి 1 -- పిల్లలకు బోలెడు సెలవులు తెచ్చిపెట్టే వేసవి కాలం అంటే చాలా ఇష్టం. దీని కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తమ స్నేహితులు, బంధువులతో కలిసి ఆటలు ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. ఒక్కోసారి ఆటల్లో మునిగిపోయి భోజనం కూడా మరిచిపోతుంటారు. వీలైనంతగా ఆరుబయటే సమయం గడపడానికే ఇష్టపడే పిల్లలు ఆహారం తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి సరదాలను, సంతోషాలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. దీని కోసం వారి ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

శారీరక కార్యకలాపాల సమయం కాబట్టి, వేసవి ఉష్ణోగ్రతను తట్టుకునేలా చూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండే ఆహారం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల కలిగే జీర్ణ సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. తాజా, పోషకాలతో నిండిన, చల్లబరిచే ఆహారాలను ఆహారంలో చేర్చడం ద్వారా...