Hyderabad, మార్చి 25 -- వేసవిలో ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కాటన్ డ్రెస్సులు తప్ప వేరేవి ఉపయోగించరు. సమ్మర్లో మారుతున్న వాతావరణాన్ని బట్టి శరీరానికి వేడి ఫీలింగ్ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? తేలికైన, స్టైలిష్ బట్టలు వేసుకోవాలంటే కేవలం కాటన్ దుస్తులే ధరించాలా? అంటే, కాటన్ డ్రెస్సులు మాత్రమే ధరించాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ తో పాటు స్టైలిష్ గానూ అనిపించే మరో 4 రకాలైన దుస్తులు ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు సౌకర్యవంతంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?

వేసవి కాలం ధరించే బట్టల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కాటన్ క్లాత్. ఇది వేసవికి అత్యంత ప్రసిద్ధమైన వస్త్ర రకాల్లో ఒకటి. పత్తి మొక్క నుండి వచ్చే ఈ వస్త్రం, చెమటను సులభంగా గ్రహించి బయటకు పంపడంలో సహాయపడుతు...