భారతదేశం, ఏప్రిల్ 16 -- Summer car care tips in Telugu : మీరు కొత్తగా కారు కొన్నారా? సమ్మర్​లో కారును జాగ్రత్తగా చూసుకోకపోతే.. భవిష్యత్తులో చాలా ఖర్చు అవుతుందని మీకు తెలుసా? అందుకే.. వేసవిలో కారు సంరక్షణ కోసం ప్రత్యేక టిప్స్​ పాటించాలి. వాటిని ఇక్కడ చూసేయండి..

వేసవిలో కారు ప్రయాణం అంటే ఏసీ ఉండాల్సిందే! వేసవిలో ఓవర్ టైమ్ పనిచేసే ముఖ్యమైన భాగాల్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఒకటి. కానీ.. వేసవిలో ఏసీ వేసినా క్యాబిన్​ చల్లపడటానికి చాలా సమయం పడుతోందని వాహన యజమానులు తరచూ చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో.. ఏసీ దాని గరిష్ట స్థాయిలో పనిచేస్తుంది కానీ కారు లోపల చిక్కుకున్న వేడి తగ్గడానికి మాత్రం టైమ్​ పడుతుంది. దీనిని నివారించడానికి.. కారును డైరక్ట్​ సన్​లైట్​లో పార్క్ చేయకుండా చూసుకోండి. పైకప్పు కింద లేదా కనీసం నీడ అందుబాటులో ఉన్న చెట్టు కింద పార్క్ ...