Hyderabad, ఏప్రిల్ 18 -- Sumaya Reddy In Dear Uma Pre Release Event: టాలీవుడ్‌లోకి కొత్తగా హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా, రచయితగా సుమయ రెడ్డి వ్యవహరించిన తెలుగు మూవీ డియర్ ఉమ. ఇందులో పృథ్వీ అంబర్ హీరోగా సుమయ రెడ్డికి జోడీగా నటించాడు.

సాయి రాజేష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన డియర్ ఉమ ఏప్రిల్ 18న అంటే ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ టాలీవుడ్ హీరోయిన్ సుమయ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. "అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మీడియానే మా ఈవెంట్‌కు ముఖ్య అతిథి. ...