Hyderabad, ఏప్రిల్ 16 -- Sumaya Reddy About Dear Uma Story Inspiration: తెలుగు హీరోయిన్ సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా చేసిన సినిమా డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నిర్వహించారు.

అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సంగీతం అందించిన డియర్ ఉమ ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సుమయ రెడ్డి డియర్ ఉమ సినీ విశేషాలను విలేకరుల సమావేశంలో ఇటీవల పంచుకున్నారు.

-మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను. కానీ, అది అంత సులభం కాదు అని అర్థమైంది.

-కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో...