భారతదేశం, ఏప్రిల్ 17 -- పుష్ప‌2 మూవీఅల్లు అర్జున్‌తో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1800 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూడో మూవీగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది.

కాగా ద‌ర్శ‌కుడిగా కెరీర్ ఆరంభం నుంచి ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ క్రియేటివ్ జీనియ‌స్‌గా పేరు తెచ్చుకున్నాడు. ల‌వ్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్...అన్ని జాన‌ర్స్‌లో సినిమాలు చేశారు. కానీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మాత్రం సుకుమార్ కామెడీ సినిమాలు ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.

సినిమాల‌పై ఆస‌క్తితో లెక్చ‌ర‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుకుమార్‌...రైట‌ర్ ఆకుల శివ ద్వారా స‌హాయ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...