Hyderabad, ఫిబ్రవరి 22 -- ఆత్మహత్య ఆలోచనలు వచ్చి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిజానికి చిన్న చిన్న సమస్యలకే అలాంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. ఒక వ్యక్తిలో ఆత్మహత్య ఆలోచనలు రావడానికి ఒక విటమిన్ లోపం కూడా కారణమేనని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొంతమందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటివారు ఆ ఉద్రేకంలో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తూ పోతూ ఉంటుంది. ఇలాంటి వారు మాత్రం తమకు ఏదైనా పోషకాహార లోపం ఉందేమోనని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తుంటాయి.

ఈ పరిశోధనలో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ మెడిసిన్ వారు, స్వీడన్లోని యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేశారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుందని,...