Hyderabad, ఫిబ్రవరి 24 -- చక్కెర తినడం, మద్యం తాగడం రెండూ ఒకటేనా? రెండూ పదేపదే తీసుకోవాలనిపించే వ్యసనాలా? ఈ విషయాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికన్ శాస్త్రవేత్తలు వాస్తవాలను కనుగొన్నారు. ఆల్కహాల్ తాగకుండా, కేవలం తీపి మాత్రమే చిన్నారులపై కూడా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో చిన్న వయస్సులోనే ఒబెసిటీ, డయాబెటిస్ ఎదుర్కొంటున్న చిన్నారులు, మద్యంతో పాటు తీపి ఎక్కువ తినే వ్యక్తులు పాల్గొన్నారు..

కొందరు పిల్లలు లేదా పెద్దలు పదేపదే ఆహారం (షుగర్) తీసుకుంటూ ఉంటారు. ఇది ఓ రకంగా చూస్తే వ్యసనం లాంటిదేనట. ఆల్కహాల్ ను కూడా ఇదే విధంగా తాగుతూనే ఉండాలని కోరుకుంటారట. దీనిని బట్టి ఆహారం లేదా మద్యం ఎక్కువసార్లు తినాలనిపించడం లేదా తాగాలనిపించడం వ్యసనంగా పరిగణించారు. అది పిల్లల్లో 12శాతం ఉంటే, పెద్దవారిలో 14శాతంగా ఉంటుందట. ఆల్కహాల్ తాగేవారిని మాత్రమే పరిశీలిస్తే 14...