భారతదేశం, మార్చి 18 -- Sudeeksha Konanki: అమెరికాలో స్థిరపడిన తెలుగు విద్యార్ధిని డొమినికన్‌ దేశంలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి మార్చి 3న కరేబియన్‌ తీరంలో ఉన్న పుంటాకానా ప్రాంతానికి వెళ్లిన సుదీక్ష కోణంకి మార్చి 6వ తేదీ నుంచి కనిపించక పోయింది. దీంతో ఆమె అచూకీ కోసం కుటుంబ సభ్యులతో పాటు ప్రవాస తెలుగు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

వాషింగ్టన్‌ డీసీలో స్థిరపడిన ప్రవాస తెలుగు కుటుంబానికి చెందిన కోణంకి సుదీక్ష మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమైంది. కాలేజీ సెలవు కావడంతో మే 3న స్నేహితురాళ్లతో కలిసి డొమనికన్ రిపబ్లిక్ దేశానికి పర్యటనకు వెళ్ళింది. మే 6 తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో హోటల్ వెనుక వున్న బీచ్‌కు వెళ్ళారు. విద్యార్థులు బీచ్‌కు వెళుతున్న కెమెరా పుటేజ్‌లో అమ్మాయిలతో పాటు మరో ఇద్దరు మగవాళ్ళు కూడా ...