Hyderabad, ఫిబ్రవరి 19 -- చిన్న వయసులోనే పెళ్లయింది. ఇరవై ఏళ్లు కూడా రాక ముందే కూతురు పుట్టింది. కూతురు పుట్టిన ఆనందం నాలుగు నెలలు కూడా మిగలలేదు. ఈలోపే భర్త ఒక ప్రమాదంలో మరణించాడు. 10వ తరగతి మాత్రమే చదివిన ఆ అమ్మాయి భవిష్యత్తు చీకటిగా మారిపోయింది. ఆమె అత్తమామలు ఎటువంటి ఆదాయం లేని వారు. అయినా కూడా ఆమె అధైర్య పడకుండా తన కూతురు కోసం నిలిచి గెలిచింది. ఆమె పేరు కనికా తాలూక్దార్. ఇలాంటి పరిస్థితుల నుంచి కనికా ఇప్పుడు నెలకు మూడున్నర లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకుంది.

ఒకప్పుడు తినేందుకు తిండి లేని పరిస్థితుల్లో ఉన్న కనికా ఇప్పుడు ఎనిమిది మందికి ఉద్యోగం కల్పించింది. ధైర్యంగా నిలుచుంటే ఒంటరి మహిళ ఏదైనా సాధించగలదని నిరూపించింది కనికా. ఆమె వర్మీ కంపోస్టును తయారు చేస్తూ భారతదేశమంతటా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆమె ఉత్పత్తులు అమెజాన్, ఫ్లి...