Hyderabad, ఫిబ్రవరి 27 -- కొడుకు పుడితే ఇంటికి వారసుడు పుట్టాడు అంటారు. అదే ఆడపిల్ల పుడితే 'ఇక్కడ పిల్ల కాదు ఎప్పటికైనా ఎక్కడో దగ్గరికి వెళ్లే పిల్ల' అని అనుకుంటారు. ఇప్పటికీ వారసుడి కోసం వరుస పెట్టి పిల్లల్ని కంటున్న వారి సంఖ్యా తక్కుమేమీ లేదు. నిజానికి కొడుకు చేసేది ఏమిటి? కూతురు చేయలేనిది ఏమిటి? అని ఒక్క రోజు కూడా ఆలోచించరు. ఇలాంటి కుటుంబంలోనే పుట్టింది సంజిత మహాపాత్ర.

సంజిత పుట్టగానే తల్లి తండ్రి బాధతో నిట్టూర్చారు. ఆడపిల్ల పుట్టిందా? ఆ పక్కన పడుంటుందిలే అని నిర్లక్ష్యం చేశారు. వారసుడు పుడితే ఎంతో బాగుండు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అప్పుడు వద్దనుకున్నా ఆడపిల్లే ఇప్పుడు ఐఏఎస్ అయ్యింది. తాను పుట్టిన జిల్లాకే మంచి పేరు తెచ్చింది.

కొడుకు పుడితే ఇంటి పేరు నిలబడుతుందని అనుకుంటారు. చదువుకున్న ఆడపిల్లలు కూడా పెళ్లయ్యాక ఇంటి పేరు మా...