Hyderabad, ఫిబ్రవరి 28 -- మస్క్ పేరు చెబితేనే అందరికీ గుర్తొచ్చేది టెస్లా. టెస్లా ఏర్పాటు వెనుక అతని కృషి ఎంతో ఉంది. జీరో స్థాయి నుంచి హీరోగా మారిన వ్యక్తి ఎలన్ మస్క్. అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తితో కాకుండా తాను సంపాదించిన డాలర్‌తోనే జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు కోట్ల డాలర్లకు అధిపతి అయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఈయన కూడా ఒకడు. జీవితంలో అతని అసాధారణ ఎంపికలే అతడిని ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు.

ఎలాన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు... ఎన్నో పరిణామాలు జరిగిపోతాయి. ఈ ఘనతంతా ఆయన స్వార్జితమే. ఎలన్ మస్క్ నుండి కొన్ని అలవాట్లను మనం అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవే అతడిని విజయం వైపు నడిచేలా చేశాయి. ఇక్కడ ఎలన్ మస్క్ ప్రతిరోజూ పాటించే కొన్ని రకాల పనులను, అలవాట్లు ఇచ్చాము. ఇవే విజయ సూత్రాలుగా భావించి మీరు పాటిస్తే మంచి ఫలితాలు దక్కు...