భారతదేశం, నవంబర్ 26 -- ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టిని జరుపుతారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి నవంబర్ 26, అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ షణ్ముఖ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచిది.

ఒకవేళ ఈ రెండు చదవలేని వారు "ఓం శ్రీ శరవణ భవాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ మంత్రాన్ని జపిస్తే కూడా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది.

నారదాది దేవయోగి బృందహృన్నికేతనం

బర్హివర్యవాహమిందు శేఖరేష్టనందనమ్

భక్తలోకరోగదుఃఖ పాపసంఘభంజనం

భావయామి సింధుతీరవాసినం షడాననమ్..

తారకారి మింద్రముఖ్య దేవబృందవందితం

చంద్రచందనాది శీతలాంకమాత్మభావితమ్

యక్షసిద్...