భారతదేశం, నవంబర్ 22 -- ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని మనం జరుపుకుంటాము.

ఆ రోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తీరుతాయని, సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు.అయితే, ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

షష్టి తిధి నవంబర్ 25 రాత్రి 7:12కి ప్రారంభమవుతుంది. నవంబర్ 26 రాత్రి 7:43కి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకోవాలి. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్టి నా...