భారతదేశం, నవంబర్ 26 -- ఈరోజే సుబ్రహ్మణ్య షష్టి. దీనిని స్కంద షష్టి లేదా మురుగన్ షష్టి అని కూడా అంటారు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టి వస్తుంది. శివుడు కొడుకు అయినటువంటి కార్తికేయుడిని ఈరోజు ప్రత్యేకించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా ఈరోజు పాటిస్తూ ఉంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ మానసిక ప్రశాంతత కలగాలంటే పరమేశ్వరుడికి వీటిని సమర్పించడం మంచిది.

ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివపార్వతులను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే ఎంతో మంచే జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈరోజు శివలింగానికే వీటిని సమర్పించడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస...