భారతదేశం, మార్చి 30 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారారు. ఆమె ప్రొడక్షన్ హౌస్ 'త్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పతాకం నుంచి తొలి చిత్రంగా 'శుభం' వస్తోంది. ఇటీవలే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. శుభం చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు. శుభం సినిమా టీజర్ నేడు (మార్చి 30) వచ్చేసింది.

శుభం టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి), పెళ్లి కూతురు శ్రీవల్లి (శ్రీయా) శోభనం గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మా వాడు అమాయకుడు, మొత్తం నువ్వే చూసుకోవాలని మీ అమ్మ చెప్పారని అతడితో శ్రీవల్లి అంటుంది. తాను ధైర్యవంతుడిననే చెప్పేందుకు డైలాగ్‍లు చెబుతాడు హర్షిత్. ఇంతలో రిమోట్‍తో టీవీ ఆన్ చేస్తుంది అమ...