Hyderabad, మార్చి 21 -- అమ్మాయిల బాడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా మంచి స్లిమ్‌గా అనిపించినప్పటికీ వారి హిప్ ఏరియా(పిరుదులు ఉండే భాగం) బాగా వెడల్పుగా కనిపిస్తుంది. కొందరిలో భుజాలు వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల వారు మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అందంగా కనిపించలేరు. ఇది వారి మొత్తం లుక్‌నే ఇవి మార్చేస్తాయి. అందుకనే చాలా మంది అమ్మాయిలు వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోవాలని ఉన్నా కూడా వేసుకోవడనాకి భయపడతారు. వాటిని వేసుకున్నప్పుడల్లా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతారు. ఇది వారిలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీకు కూడా హిప్ ఏరియా లేదా భుజాలు వెడల్పుగా ఉండటం వల్ల ఇబ్బందులను ఎదర్కొంటుంటే ఈ స్టైలింగ్ టిప్స్ మీ కోసమే.

మీరు మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసిపోవాలనుకుంటే ముందు మీరు మీ బాడీ టైప్ ను అర్థం చేసుకుని. మీ శరీరం షేపును బట్...