Hyderabad, జనవరి 25 -- మహిళ్లలకు అత్యంత అవసరమైన, ఇష్టమైన వస్తువులు ఏంటి అని అడిగితే మొదట హ్యాండ్ బ్యాగ్ పేరు చెబుతారు. అది కాన్వాస్‌తో చేసిన సాధారణ హ్యాండ్‌బ్యాగ్ అయినా, లెదర్‌తో తయారు చేసిన స్టైలిష్ బ్యాగ్ అయినా సరే. ఇది లేకుండా మహిళలు ఇంటి నుండి బయటకు వెళ్లరు. నిజానికి, హ్యాండ్‌బ్యాగ్ కేవలం బ్యాగ్ మాత్రమే కాదు, అందులో మేకప్ వస్తువుల నుండి ఇంటి తాళాలు, అవసరమైన మందులు, డబ్బు, ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు తమ హ్యాండ్‌బ్యాగ్‌లో ఒక చిన్న ప్రపంచాన్ని మోసుకెళ్తారు. బహుశా అందుకే ఒకప్పుడు ఓవర్‌సైజ్ హ్యాండ్‌బ్యాగ్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి, పెద్ద బ్రాండ్‌ల నుండి స్థానిక మార్కెట్ వరకు పెద్ద పెద్ద హ్యండ్ బ్యాగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

కానీ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ మారిపోయింది. పెద్ద బ్యాగుల స్థానంలో అందమైన, చిన్న హ్...