Hyderabad, ఫిబ్రవరి 9 -- ట్రెండ్‌కు తగ్గట్టుగానే విషింగ్ స్టైల్ మారుతూ ఉంటాయి. ప్రేమను వ్యక్తపరచడానికి తమకు వీలైనంత విలువైన వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వాలని ఆసక్తి కనబరుస్తుంటారు. మట్టిగాజులు, గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్ బాక్సులు, గోల్డ్ రింగుల నుంచి ప్లాటినం ఆభరణాల వరకూ ట్రెండ్ వచ్చేసింది. ఇలాంటి విలువైన ప్లాటినం వస్తువులతో ప్రేమను వ్యక్తీకరిస్తే, అవి ధరించి అంతకుమించిన ప్రకాశవంతమైన లుక్ కనబరచడమే రిటర్న్ గిఫ్ట్. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ లుక్ రావడానికి మీరేం చేయాలని ఆలోచిస్తున్నారా. ఈ టిప్స్ పాటించి మెరిసిపోయే అందాన్ని సొంతం చేసుకోండి.

ప్లాటినంను ప్రత్యేకంగా చేసేది దాని అరుదైన సాగే స్వభావం. రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కల ఢీకొనడం వల్ల ఏర్పడిన ప్లాటినం, బంగారం కంటే 30 రెట్లు అరుదైన లోహం. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక ప్రదేశాల ను...