భారతదేశం, ఏప్రిల్ 14 -- విధానపరమైన మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ విద్యార్థుల కలల సాకారానికి యూకే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇందుకు నిత్యం పెరుగుతున్న యూకే స్టడీ వీసా అప్లికేషన్ల సంఖ్య చక్కటి ఉదాహరణ. 2024 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో యూకే వీసా అప్లికేషన్లు 13శాతం పెరిగి 28,700కి చేరాయి. గతేడాదితో పోల్చికే యూకేలో చదువు కోసం వీసా అప్లికేషన్ల పెరగడం 2023 అక్టోబర్​ తర్వాత ఇదే మొదటిసారి. దీనిబట్టి, యూకేలో విద్యకు ఉన్న డిమాండ్​ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఎన్ని మార్పులు వచ్చినా యూకేలో చదువకు డిమాండ్​ పెరుగుతూనే ఉంటుందని ఇంటర్నేషనల్​ స్టూడెంట్​ లోన్​ లెండర్​ ప్రాడిగీ ఫైనాన్స్​ అంచనా వేసింది.

ధరలు పెరుగుతున్నప్పటికీ, అనేక విధానపరమైన మార్పులు కనిపించినప్పటికీ విద్యార్థులు యూకేని ప్రిఫర్​ చేస్తుండటం.. ఇక్కడ అ...