భారతదేశం, మార్చి 19 -- Students Market: వ్యవసాయం పై ఆధారపడి జీవించే తల్లిదండ్రులు పడే కష్టనష్టాలపై అవగాహన కల్పించడానికి కరీంనగర్‌లో విద్యార్థులతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు.

కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్.. రైతులు లేని విద్యార్థుల వెజిటబుల్ మార్కెట్ గా మారింది. నిత్యం కూరగాయలు విక్రయించే రైతులు, కొనుగోలు చేసే వినియోగదారులతో రద్దీ ఉండే రైతు బజార్ అరుదైన కార్యక్రమానికి వేదిక అయింది.

వినూత్నమైన కాన్సెప్ట్ తో విద్యార్థులతో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పండించిన కూరగాయలను విద్యార్థులచే విక్రయించారు. విద్యార్థుల కూరగాయల మార్కెట్ ను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి కలెక్టర్ తోపాటు జిల్లా అధికారులు ఉద్యోగులు వినియోగదారులుగా కూరగాయలు కొనుగోలు చేశారు.

కరీంనగర్ జిల్లాలో వంద ప్రభుత్వ పాఠశాలల్లో జన్య ఫౌ...