Hyderabad, మార్చి 24 -- విద్యార్థుల విజయానికి క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల, ప్రతిభ, తెలివితేటలు అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక విద్యార్థికి ఈ అంశాలన్నీ ఉండి, ఆ ఒక్క ముఖ్యమైన లక్షణం లేకపోతే, అటువంటి విద్యార్థి విజయం సాధించలేడు. అంత ముఖ్యమైన లక్షణం ఏమిటని తెగ ఆలోచించేస్తున్నారా? అదేనండీ.. క్యురియాసిటీ. చాలా విషయాల గురించి తెలిసిన వెంటనే క్యూరియస్ గా ఫీలయ్యే పిల్లలు కొన్ని విషయాల పట్ల అంతగా ఆసక్తి చూపరు. వాటిల్లో ఎడ్యుకేషన్ ఒకటి కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి.

పిల్లలకు వారు చదివే సబ్జెక్టులన్నింటిలో కేవలం కొన్నింటి మీద మాత్రమే క్యూరియస్ గా ఉంటారు. వారిలో ఉండే ఈ కుతూహలమే త్వరగా నేర్చుకోవడానికి దారితీస్తుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల్లో ఈ రకమైన భావన కలగకుండా ఒత్తిడి పెరిగిపోయి మార్కుల కోసం తంటాలు పడుతున్నారు. కానీ, నేర్చుక...