Hyderabad, ఫిబ్రవరి 2 -- ఒత్తిడి ప్రతి మనిషిలో సాధారణం కానీ దీన్ని వెంటనే తగ్గించుకోకపోతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొన్ని సార్లు మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహాద్యోగులతో మీకున్న సంబంధ బాంధవ్యాలను కూడా దెబ్బతీస్తుంది. కనుక దాని నుంచి ఎప్పటికప్పుడు బయట పడాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరిపడా నిద్ర, శారీరక, మానసిక విశ్రాంతి సహాయపడతాయి. అలాగే వెంటనే ఒత్తిడి నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు సహాయపడతాయి. ఎంతటి ఒత్తిడిని అయినా కేవలం ఐదు నిమిషాల్లో పోగొట్టే మార్గాల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి.

మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఒక గ్లాసు నీటిని ఆగకుండా తాగేయండి.ఇది మీ ఒత్తిడి స్థాయిలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. మీ మొత్తం శ్రేయస్సు కోసం హైడ్రేటెడ్‌గా ఉం...