Hyderabad, ఫిబ్రవరి 8 -- అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఎండ తగలకుండా ఉండటం, రకరకాల క్రీములు వాడటం కాదు.. సంతోషంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవును అనేక రకాల చర్మ సమస్యలకు బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి, UV కిరణాలు వంటి వాటి కన్నా ఎక్కువ మానసిక ఒత్తిడి కారణమవుతుందట. ఒక్కమాటలో చెప్పాలంటే అందం విషయంలో వీటన్నింటి కన్నా ఒత్తిడి చాలా ప్రమాదకారిగా వ్యవహరిస్తుందట. అందంపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది? దాని నుంచి ఎలా తప్పించుకోవాలి తెలుసుకుందాం.

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆశ్చర్యకరమైన విషయం భారతదేశంలో దాదాపు 77 శాతం మంది ఒత్తిడి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. అందంపై, ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా లోతైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద కాసేపు మాత్రమే ఉండచ్చు. కాసేపటికి ...