Hyderabad, జనవరి 30 -- ఆధునిక మానవుడి అతిపెద్ద శత్రువు ఒత్తిడే. ఈ ఉక్కిరి బిక్కిరి ప్రపంచం మనషిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తోంది. చిన్నపాటి ఒత్తిడే కదా అని వదిలేస్తే అది మనిషినే కబళిస్తుంది. జీవితాన్ని హరిస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి వల్ల ఎన్నో కొత్త రోగాలు, సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒత్తిడి కలగడానికి కారణం మన జీవన శైలే. ఉదయం లేస్తూనే ఉరుకులు పరుగులు. గబగబా రెండు ముద్దలు తినేసి పనులకు పరుగులు పెడతారు. ఆఫీసు పనులు, ఆర్ధిక ఒతిళ్లు, పిల్లలు, స్కూల్లు అన్నీ కలిపి మనిషిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా కుంగదీస్తున్న అతి పెద్ద సమస్యగా ఒత్తిడి మారిపోయింది.

ఒత్తిడికి లోనవటం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు మనల్ని దాడి చేస్తున్నాయి. కార్టిసాల్, అడ్రినలిన్ వల్ల ఒత్తిడి ప్రభావం మన నాడీ వ్యవస్థ పై ప్రభావం ...