భారతదేశం, మార్చి 27 -- Street Fight: రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు నడిరోడ్డు వేదికగా మారింది. పరస్పర దాడులతో నడిరోడ్డుపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నడి రోడ్డుపై రెండు కుటుంబాలు కొట్లాడుకుంటుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాాబాద్ జిల్లా జీకే తండాకు చెందిన భద్రమ్మ, అదే తండాకు చెందిన రమేశ్ కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా బాట పంచాయితీ నడుస్తోంది. ఆ బాట తమదంటే తమదనే గొడవలు జరుగుతుండగా.. కొంతకాలంగా ఇరు కుటుంబాల పంచాయితీ పెద్ద మనుషుల దాకా వెళ్లింది.

దీంతో గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాల మధ్...