భారతదేశం, మార్చి 21 -- Stray Dogs Attack: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కల బెడద జనాలను బెంబేలెత్తిస్తోంది. నిత్యం ఎక్కడో చోట వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాటి బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా.. ఆ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

తల, ముఖంపై కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలపాలై ఆ చిన్నారి విల విలలాడటం అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద వంగర మండల కేంద్రానికి చెందిన చిలుక వెన్నెల మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో మూడేళ్ల వయసున్న చిన్న కూతురు నందిని గురువారం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లింది.

అక్కడి నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్...