Hyderabad, మార్చి 25 -- జామ్ అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా? అంటే ఉండరు అని కచ్చితంగా చెప్పేయచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయనో లేక వాటి తయారీలో ఉపయోగించిన రసాయనాలు, రంగులు పిల్లల ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేస్తాయనో భయంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు జామ్ ఇవ్వడానికి భయపడతారు. అయినప్పటికీ పిల్లలు వినకుండా మారాం చేస్తారు. మీ పిల్లలు కూడా ఇలాగే జామ్ కోసం మిమ్మల్ని విసిగిస్తుంటే వారి నోరు కట్టేయకండి. వారు ఎంత తిన్నా ఆరోగ్యానికి హాని తలపెట్టని జామ్ ను ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి.

ఎలాంటి రసాయనాలు లేకుండా, కృత్రిమ రంగులను కలపకుండా పండ్లు, చియా గింజలతో జామ్ ను తయారు చేయచ్చు. అది కూడా చాలా సులువుగా. దీన్ని ఒక్కసారి చేశారంటే నెల రోజుల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు లేటు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్ట్రాబ...