Hyderabad, ఫిబ్రవరి 10 -- పొట్టనొప్పి తరచూ ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పిల్లలు, పెద్దలూ కూడా దీని బారిన పడుతూ ఉంటారు. పొట్ట ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి. మీరు తినే ఆహారంలో ఫైబర్ కూడా ఉండాలి. ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఇది జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పొట్ట ఆరోగ్యానికి మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల జాబితా ఇక్కడ ఉంది. ఇది మీ శరీర జీవక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పోషకాలు సమతుల్యంగా ఉండడంలో ఇలాంటి ఆహారాలు సహాయపడతాయి.

100 గ్రాముల బ్రోకలీలో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్...