భారతదేశం, ఏప్రిల్ 19 -- Stocks to buy today : ఇజ్రాయెల్​- ఇరాన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లలో గత కొన్ని రోజులుగా నష్టాలు కనిపిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో కూడా స్టాక్​ మార్కెట్​లు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 455 పాయింట్లు కోల్పోయి 72,499 వద్ద ముగిసింది. 152 పాయింట్లు కోల్పోయిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 21,996 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక 415 పాయింట్ల నష్టంతో.. 47,069 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య నెలకొన్న అనిశ్చితి తొలగేంతవరకు.. స్టాక్​ మార్కెట్​లలో తీవ్ర ఒడుదొడుకులు తప్పవు.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో.. ఎఫ్​ఐఐలు రూ. 4260.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2285.52 క...