భారతదేశం, ఫిబ్రవరి 3 -- బడ్జెట్​ 2025 కారణంగా శనివారం ఓపెన్​లో ఉన్న దేశీయ స్టాక్​ మార్కెట్​లు ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 5 పాయింట్లు పెరిగి 77,505 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు పడి 23,482 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 49,507 వద్దకు చేరింది.

"మార్కెట్​ షార్ట్​-టర్మ్​ ట్రెండ్​ బల్లిష్​గా ఉంది. కానీ టెంపరరీ ఓవర్​బాట్​ కండీషన్​ కారణంగా రేంజ్​-బౌండ్​ యాక్షన్​ని మనం చూడవచ్చు. నిఫ్టీ50కి 3,270-23,100 కీలక సపోర్ట్​గా ఉంది. 23810- 23,900 రెసిస్టెన్స్​గా ఉంది," అని కొటాక్​ సెక్యూరిటీస్​ ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శనివారం ట్రేడింగ్​ సెషన్​లోనూ ఎఫ్​ఐఐలు రూ. 1,327.09 కోట్లు విలువ చేసే ష...