భారతదేశం, నవంబర్ 29 -- Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్​ షేర్లు ఇచ్చిన జోష్​తో.. నిఫ్టీ50.. ఆల్​టైమ్​ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్​ఈ సెన్సెక్స్​.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ స్మాల్​ క్యాప్​ సూచీ 0.77శాతం, మిడ్​ క్యాప్​ సూచీ 0.27శాతం పెరిగాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50.. ప్రతి రెసిస్టెన్స్​నూ దాటుకుంటూ దూసుకెళుతోంది.

"వీక్లీ ఛార్ట్​ను చూస్తే.. నిఫ్టీ పైకి దూసుకెళుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వీక్​నెస్​ అస్సలు కనిపించడం లేదు. రివర్సెల్​లు కూడా లేవు. ఇక సోమవారం ఆల్​ టైమ్​హై(18,614)ని తాకింది. ఇక్కడి నుంచి 18,955 వరకు పెరగొచ్చు. 1-2 వారాల్లోనే ఇది సాధ్యపడొచ్చు. 18...