భారతదేశం, జనవరి 31 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 227 పాయింట్లు పెరిగి 6,760 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 86 పాయింట్లు వృద్ధిచెంది 23,249 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 49,312 వద్దకు చేరింది.

"నిఫ్టీ50కి 23,300 దగ్గర రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. అక్కడే 20 డే ఈఎంఐ ఉంది. ఇది చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ పడితే 23,000- 22,700 జోన్​కి పడొచ్చు," అని రెలిగేర్​ బ్రోకింగ్​ ఎస్​వీడీ అజిత్​ మిశ్రా తెలిపారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,582.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2165.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కె...