భారతదేశం, మార్చి 6 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో నష్టాల పరంపరకు బుధవారం బ్రేక్​ పడింది! బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని సెన్సెక్స్​, నిఫ్టీలు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 740 పాయింట్లు పెరిగి 73,730 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధచెంది 22,337 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 48,490 వద్దకు చేరింది.

"ఫిబ్రవరి 6, 2025 తర్వాత మొదటిసారిగా నిఫ్టీ దాని 5-డే ఈఎంఏ పైన ముగియడం ద్వారా షార్ట్​ టర్మ్​ నెగిటివ్​ ట్రెండ్​ రివర్స్​ అయినట్టు కనిపిస్తోంది. ఇండెక్స్‌కు 22500- 22700 వద్ద రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. 22173- 22000 లెవల్స్​ నిఫ్టీకి సపోర్ట్​ అందించవచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ ప్రైమ్​ రీసెర్చ్​ హెడ్​​ డెవర్ష్ వకిల్ అన్నారు.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 28925.04 కోట్...