భారతదేశం, ఫిబ్రవరి 16 -- 2024 అక్టోబర్​ నుంచి దేశీయ స్టాక్​ మార్కెట్​లు పడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2025 మొదటి రెండు నెలల్లో సెన్సెక్స్​, నిఫ్టీలు భారీగా కరెక్ట్​ అయ్యాయి. స్టాక్స్​తో పోల్చుకుంటే.. ఈ మధ్య కాలంలో బంగారంపై పెట్టుబడి మంచి రిటర్నులు ఇస్తోంది. ఈ రెండు నెలల్లోనే బంగారం భారీగా పెరగడం ఇందుకు కారణం. ఈ రెండు నెలల్లోనే బంగారం 12శాతానికి పైగా రిటర్నులు తెచ్చిపెట్టింది. అయితే, మార్కెట్​లు ఎంత పడుతున్నా 5 ముఖ్యమైన స్టాక్స్​ మాత్రం భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఇన్వెస్టర్స్​కి మంచి రిటర్నులు ఇచ్చి సంతోషపెడుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ముందుగా స్టాక్​ మార్కెట్​ క్రాష్​ గురించి మాట్లాడుకుంటే.. భారత ఈక్విటీ మార్కెట్లు 2025లో ఇప్పటివరకు దాదాపు రూ.45 లక్షల కోట్లు నష్టపోయాయి. 2024 సెప్టెంబర్ 27న ఆల్​టైమ్​ హైకి చేరినప్పటి నుంచ...