భారతదేశం, సెప్టెంబర్ 24 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 58 పాయింట్లు పడి 82,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 33 పాయింట్లు కోల్పోయి 25,169 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 225 పాయింట్లు పెరిగి 55,509 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,551.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,670.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ సెప్టెంబర్​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 17,032.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 43,578.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల ...