భారతదేశం, జనవరి 28 -- Stock market today: భారత స్టాక్ మార్కెట్లు జనవరి 28న లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్ ప్రధాన బెంచ్ మార్క్ లైన సెన్సెక్స్, నిఫ్టీ 50 మంగళవారం గ్రీన్ కలర్ లో మెరిశాయి. సెన్సెక్స్ 75,366.17 వద్ద ప్రారంభమై, 1,147 పాయింట్లు లేదా 1.5 శాతం పెరిగి 76,512.96 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 309 పాయింట్లు లేదా 1.4 శాతం పెరిగి 22,960.45 వద్ద ప్రారంభమైంది. చివరకు సెన్సెక్స్ (sensex) 535 పాయింట్లు లేదా 0.71 శాతం పెరిగి 75,901.41 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో 22,957.25 వద్ద ముగిశాయి.

అయితే మిడ్, స్మాల్ క్యాప్స్ సెగ్మెంట్లు అంతంత మాత్రంగానే రాణించాయి. బీఎస్ ఈ మిడ్ క్యాప్ సూచీ 0.61 శాతం నష్టంతో ముగియగా, బీఎస్ ఈ స్మాల్ క్యాప్ సూచీ 1.77 శాతం నష్టంతో ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో నష్టాల కార...