భారతదేశం, ఏప్రిల్ 9 -- Stock market today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలతో తలెత్తిన వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి.వాణిజ్య యుద్ధం దిశపై నెలకొన్న అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో భారీ నష్టాలను మిగిల్చింది. ఏప్రిల్ 9న జపాన్ కు చెందిన నిక్కీ 4 శాతానికి పైగా నష్టపోగా, ప్రధాన యూరోపియన్ సూచీలు ఎఫ్ టిఎస్ ఇ, సిఎసి, డాక్స్ లు ట్రేడింగ్ ముగిసే సమయానికి 3 శాతం చొప్పున నష్టపోయాయి.

భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 380 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టంతో 73,847.15 వద్ద ముగియగా, నిఫ్టీ 50 137 పాయింట్లు లేదా 0.61 శాతం నష్టంతో 22,399.15 వద్ద ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.73 శాత...