భారతదేశం, ఏప్రిల్ 8 -- స్టాక్ మార్కెట్ నేడు పుంజుకుంది. వాణిజ్య సుంకాల ఆందోళనల కారణంగా గత సెషన్ లో చోటు చేసుకున్న భారీ అమ్మకాల తరువాత ఏప్రిల్ 8 మంగళవారం ట్రేడింగ్ లో భారత మార్కెట్లు అద్భుతంగా పుంజుకున్నాయి. అమెరికాతో జపాన్ సంభావ్య టారిఫ్ చర్చల ఆశలపై సెంటిమెంట్ మెరుగుపడింది. నిఫ్టీ 1.69 శాతం లాభంతో 22,535 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 1.55 శాతం లాభంతో 74,243 పాయింట్ల వద్ద సెషన్ ను ముగించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 2.11 శాతం పెరిగి 49,838 పాయింట్ల వద్ద, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.13 శాతం లాభంతో 15,389 పాయింట్ల వద్ద సెషన్ ను ముగించాయి.

డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య ఉద్రిక్తతలు ఇటీవలి వారాల్లో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదేలయ్యాయి. ఇది ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మాంద్యం, యుఎస్ లో మాంద్యం భయాలతో పెట్టుబడిదారులను భయపెట్టిం...