భారతదేశం, ఏప్రిల్ 3 -- Stock market today: భారత ఎగుమతులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 26% టారిఫ్ ల ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై భయపడినంతగా పడలేదు. భారత మార్కెట్లు ఏప్రిల్ 3 గురువారం సెషన్ ను స్వల్ప నష్టాలతో ముగించాయి. పలు ఆసియా దేశాల కన్నామెరుగ్గా నిలిచాయి. ఔషధాల దిగుమతులపై సుంకాలను ట్రంప్ మినహాయించడంతో దేశీయ ఫార్మా స్టాక్స్ లో భారీ ర్యాలీ చోటు చేసుకుంది.

మరోవైపు, ఇతర ఆసియా దేశాలపై ట్రంప్ విధించిన అధిక సుంకాల వల్ల భారత్ ప్రయోజనం పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దాంతో, టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ems) వంటి ఇతర రంగాలు సానుకూలంగా ముగిశాయి. ఏదేమైనా, పరస్పర సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతుందనే భయాలను మరింత రేకెత్తించాయి, నేటి ట్రేడింగ్ లో టెక్నాలజీ స్టాక్స్ భారీగా నష్టపో...