భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రేపు, సెప్టెంబర్ 8, 2025న సెలవు దినంగా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. మరి రేపు స్టాక్​ మార్కెట్​లు పనిచేస్తాయా? అని తెలుసుకునేందుకు మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.

ఈద్-ఏ-మిలాద్‌ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారు. ముఖ్యంగా సూఫీ, బరేల్వీ వర్గాల వారు దీనిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజును అని చెబుతుంటారు.

మహారాష్ట్రలో ఈద్-ఏ-మిలాద్‌కు సెలవు ప్రకటించినప్పటికీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్​ఈ) మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 8, సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. అంటే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ...