భారతదేశం, ఏప్రిల్ 7 -- ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ దారుణంగా ఉంది. భారత్‌లోని టాప్ 4 బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ, శివ్ నాడార్ సంపద భారీగా తగ్గింది. ఈ నలుగురు బిలియనీర్ల మొత్తం సంపద సోమవారం 10.3 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అంటే 85 వేల కోట్ల రూపాయలకుపైగా కరిగిపోయింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ జాబితా ప్రకటించింది. ముఖేష్ అంబానీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సంపద 3.6 బిలియన్ డాలర్ల వరకు క్షీణించింది. దీంతో ముకేశ్ అంబానీ సంపద 87.70 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

అదే సమయంలో గౌతమ్ అదానీ సంపద 3 బిలియన్ డాలర్లు తగ్గి 57.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ నికర విలువ 2.2 బిలియన్ డాలర్ల నష్టంతో 33.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో శివ్ నాడార్‌కు సోమవారం 1.5 బిలియన్ డాల...