భారతదేశం, ఫిబ్రవరి 21 -- Stock market analysis: బలహీన అంతర్జాతీయ సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాల బాట పట్టింది. ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో భారీ అమ్మకాలతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 ఫిబ్రవరి 21న 0.5 శాతానికి పైగా క్షీణించాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 560 పాయింట్లు క్షీణించి 75,175.97 వద్ద కనిష్టానికి పడిపోయింది. గత 13 సెషన్లలో 12 సెషన్లలో సెన్సెక్స్ నష్టాలనే నమోదు చేసింది, ఈ కాలంలో 3,400 పాయింట్లు లేదా 4 శాతానికి పైగా క్షీణించింది.

సెన్సెక్స్ 2024 సెప్టెంబర్ 27న 85,978.25 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నాటి నుంచి సెన్సెక్స్ ఫిబ్రవరి 1వ తేదీ వరకు 12.5 శాతం, అంటే 10,802 పాయింట్లు నష్టపోయింది. 2024 అక్టోబర్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు...