భారతదేశం, ఫిబ్రవరి 19 -- కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మెుదటి నుంచి స్టాక్ మార్కెట్ అనుకున్నంతగా రాణించడంలేదు. దీంతో మదుపర్ల డబ్బు ఆవిరైపోతుంది. ఇప్పటికే టాప్ 10 పెట్టుబడిదారులుగా పేరు ఉన్న వ్యక్తులు రూ.81 వేల కోట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని షేర్లు కూడా భారీగా పడిపోయాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ పతనంతో ప్రభుత్వ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెలన్నర కాలంలో ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని షేర్ల విలువ సుమారు రూ.84,000 కోట్లు తగ్గింది. డిసెంబర్ 2024 త్రైమాసికం నాటికి ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలోని లిస్టెడ్ కంపెనీల హోల్డింగ్స్ విలువ రూ .14.72 ట్రిలియన్లుగా ఉంది. ఫిబ్రవరి 18, 2025న ఈ హోల్డింగ్స్ వి...