భారతదేశం, డిసెంబర్ 9 -- మదుపర్లను భయపెట్టే విధంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లో పతనం కొనసాగుతోంది! సోమవారం డౌన్​ అయిన సెన్సెక్స్​, నిఫ్టీలు.. మంగళవారం కూడా నష్టాలనే చూస్తున్నాయి. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా (1.5% కన్నా ఎక్కువ) నష్టపోయింది. నిఫ్టీ50 దాదాపు 2% నష్టపోయింది. మరి ఈ పతనానికి కారణాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

మార్కెట్​ ఓపెన్​ అయిన అనంతరం సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పడి ఇంట్రాడే కనిష్ట స్థాయి 84,382.96 ని తాకింది. నిఫ్టీ 50 కూడా 1% పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 25,729.35 ను హిట్​ చేసింది.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండూ ఈ సెషన్‌లో 1.5% చొప్పున పతనమై, తీవ్ర అమ్మకాల ఒత్తిడిని కొనసాగించాయి.

మంగళవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్​ 4...