భారతదేశం, ఫిబ్రవరి 10 -- దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీగా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్లు పడిపోయాయి. ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు క్షీణించాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం తగ్గి 77,311.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.76 శాతం లేదా 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది.

టాప్ 30 సూచీల్లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 30 షేర్లలో 24 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ లోని 232 కంపెనీల షేర్లు ఈ రోజు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. 349 కంపెనీలు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్...